![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -379 లో.. ముకుంద అన్న మాటలని భవాని గుర్తుకుచేసుకుంటుంది. అసలు ముకుంద నిజంగానే మారిందా.. నాకు ఎందుకో నమ్మాలనిపించడం లేదు. వాళ్ళ అన్నయ్య అంత పెద్ద మోసం చేస్తే చెల్లెలికి తెలియకుండా ఉంటుందా అని భవాని ఆలోచిస్తుంటుంది. అసలేం చెప్పి ఆదర్శ్ ని తీసుకొని వచ్చారు. ముకుంద మారకుంటే పరిస్థితి ఏంటి? ఈ తింగరి కృష్ణ అతి మంచితనంతో అందరి సంతోషం కోసం ట్రై చేస్తుందని భవాని అనుకుంటుంది.
ఆ తర్వాత అప్పుడే రేవతి వచ్చి మరొక పంతులిని పిలిపించి ముహూర్తం చూడమని చెప్తాదామా అని అనగానే.. వద్దు ఎవరు చూస్తే ఏంటని భవాని అంటుంది. అయిన మీలో ఆదర్శ్ వచ్చినప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదని రేవతి అడుగుతుంది. అదేం లేదంటూ భవాని కవర్ చేస్తుంది. మరి నువ్వు ఎలా ఉన్నావని రేవతిని భవాని అడుగుతుంది. చూస్తుంటే తెలియడం లేదా చాలా హ్యాపీగా ఉన్నాను. కృష్ణ మురారి ఇద్దరు ఒకటయ్యారు. ముకుంద మారింది ఆదర్శ్ ఇంటికి వచ్చాడు. ఇంకేంటని రేవతికి చెప్తుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఆదర్శ్ ని తీసుకొని వచ్చి మంచి పని చేశారు అంటావా అని భవాని అంటుంది. ఎందుకలా అంటున్నావ్ అక్క అని రేవతి ఆశ్చర్యపడుతుండగా.. అదేం లేదని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి వెళ్తు.. అక్క అసలు ఎందుకు అలా అడిగింది.. ఇంకా ముకుంద మారిందని నమ్మడం లేదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆదర్శ ఒంటరిగా కూర్చొని.. ముకుంద ఎందుకు అలా అబద్ధం చెప్పింది. నేను అంటే ఇష్టం లేకనా లేక నా మీద ఇంకా కోపం తగ్గలేదా.. నాపై ఇష్టం ఉండే కదా.. నన్ను రమ్మని చెప్పింది. నేను సడన్ గా చెయ్యి వేసేసరికి బయపడినట్లు ఉందని ఆదర్శ్ అనుకుంటాడు.
ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మధు వచ్చి.. డ్రింక్ చేద్దామని అంటాడు. దానికి సరే అని మధు, ఆదర్శ్ లు డ్రింక్ చేస్తుంటే అప్పుడే సుమలత వచ్చి.. నువ్వు చెడిపోయిందే కాకుండా ఆదర్శ్ ని కూడా చెడగొడుతున్నావా అని మధుని సరదాగా కొడుతుంది. ఆ తర్వాత మురారి రెడీ అవుతు.. ఇన్ని రోజుల తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేద్దాం రమ్మని చెప్పాడని కృష్ణని పర్మిషన్ అడుగుదామని అనుకుంటాడు. కృష్ణని అడగ్గానే ఓకే చెప్తుంది. దాంతో మురారి హ్యాపీగా ఫీల్ అవుతు.. కృష్ణకి ముద్దుపెట్టి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఆదర్శ్, మధు, మురారి, ప్రసాద్ లు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |